Aaluru

ఆలూరు నియోజకవర్గంలో మదాసి కురువ లను గుర్తించని టిడిపి పార్టీ

ఆలూరు నియోజకవర్గంలో మదాసి కురువ లను గుర్తించని టిడిపి పార్టీ

ఆలూరు (పల్లె వెలుగు) 03 అక్టోబర్: ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం లో మదాసి కురువ రాష్ట్ర కమిటీ నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మదాసి కురువ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్. మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం లో మా సామాజికవర్గం దాదాపు 59 వేల ఓట్ల జనాభా ఊన్నారు మమ్మల్ని గుర్తించి మండల కన్వీనర్ గా ఎంపిక చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.  అలాగే మదాసి కురువ మదారి కురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామ మోహన్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గనికి సంబంధించిన మండలాలలో మా కుల సామాజిక వర్గం అత్యధిక జనాభా హోళగుంద, హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, మిగతా రెండు మండలాలలో పరిమితంగా మా సామాజిక వర్గం ఉంది  ఆలూరు నియోజకవర్గం లో మా సామాజిక వర్గం వారు టిడిపి మండల కన్వీనర్ గా అనర్హులా లేక మండల కన్వీనర్ గా పనికిరామ అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడి గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు గెలిపించి సత్తా చాటుకున్న మా సామాజిక వర్గానికి ఇదేనా మాకు మీరిచ్చే బహుమతి అగ్రవర్ణాల వారు మా సామాజిక వర్గాన్ని అనగ దోక్కే ప్రయత్నం చేస్తున్నారు మీ కుటిల ప్రయత్నాన్ని తిప్పికొడతాం మీ భజన చేసేవారికి అందలం ఎక్కిస్తా రా ప్రశ్నించే వారిని అనగ దొక్కుతారా  పెద్ద హోతూరు గ్రామంలో కురువ సామాజిక అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేస్తే అదే గ్రామానికి చెందిన ప్రముఖ మహిళ ఇప్పుడు రాష్ట్ర కమిటీలో స్థానం కలిగిన మహిళ  సర్పంచ్ ను ఓడించి తీరాలని తెరవెనుక ఎన్నో కుట్రలు పన్నారు ఆ కుట్రలన్నీ పటాపంచలు చేసి  మా సామాజిక వర్గం నీతి నిజాయితీకి మారుపేరు అని మరోసారి నిరూపించి గెలిచారు నమ్మిన పార్టీకి ప్రాణమైన ఇస్తాము కానీ  ద్రోహం చేయము అని మరోసారి రుజువు చేశారు పార్టీని ప్రాణంగా పెట్టుకున్నవారికి మండల కమిటీ లో కానీ జిల్లా కమిటీ లో కానీ రాష్ట్ర కమిటీ లో కానీ స్థానం లేదా మా సత్తా ఏంటో రాబోవు రోజుల్లో చూపిస్తాం.. రాబోవు రోజుల్లో మా పాత్ర ప్రముఖంగా ఉండేవిధంగా చూపిస్తాం..అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మదాసి కురువ నాయకులు సభ్యులు పాల్గొనడం జరిగింది

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button