
గణపతి విగ్రహాలను బహిరంగ ప్రదేశాల్లో పూజించుటకు అనుమతి ఆదేశాలు ఇవ్వాలి – బిజెపి డిమాండ్
ఆలూరు (పల్లె వెలుగు) 6 సెప్టెంబర్: ఆలూరు నియోజకవర్గం లో స్థానిక పోలీస్ స్టేషన్ నందు సిఐ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎపి రాష్ట్ర సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ హిందూ మతాలను కించ పరిచే విధంగా వినాయక విగ్రహాలను వీధిలో కాకుండా కేవలం ఇంటిలో మాత్రమే పూజించుకోమనడం నిజమైన చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున లేని covid 19 ఆంక్షలు కేవలం వినాయక చవితి పండుగకు మాత్రమే వర్తిస్తాయా తక్షణమే గణపతి విగ్రహాలను బహిరంగ ప్రదేశాల్లో పూజించుటకు అనుమతి ఆదేశాలు ఇవ్వమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మన హిందూ పండుగలు జరుపుటకు ఏ ప్రభుత్వాల అనుమతి అక్కర్లేదు ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డి వెంకట్రాముడు మండల అధ్యక్షుడు వీరేష్ దేవనకొండ మండలం అధ్యక్షుడు రవి కుమార్ జనసేన మండల నాయకులు అరవింద్, హేమంత్ బిజెపి కార్యకర్తలు రవి సంజన్న దేవరకొండ బీజేవైఎం మండలాధ్యక్షుడు రామాంజనేయులు కర్నూలు జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు వీరభద్ర జనసేన కార్యకర్తలు మనోజ్ వినోద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు