
అగ్రిగోల్డ్ భాదితులకు జగనన్న భరోసా
ఆలూరు (పల్లె వెలుగు) 24 ఆగష్టు: ఆలూరు పట్టణం మంత్రి క్యాంపు నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలాభిషేకం చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరులు గుమ్మనూరు శ్రీను గుమ్మనూరు నారాయణ స్వామి మరియు ఆలూరు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వీరేష్. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసి మోసపోయిన బాధితులు ఏ ఒక్కరూ గతంలోలా మానసిక క్షోభకు గురికాకూడదని, పాదయాత్రలో, మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం డిపాజిట్ దారులకు చెప్పినట్లుగా చెల్లింపులు చేస్తూ , నేడు 7లక్షల పైచిలుకు డిపాజిటర్లకు రూ.666.84 కోట్లు చెల్లింపుతో ఇప్పటి వరకు రూ.20వేల వరకు డిపాజిట్ చేసిన మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న ప్రభుత్వం అందించిన పూర్తి మొత్తం రూ.905.57 కోట్లు. ఇది పేద ప్రజల మేలు కోరే మనసున్న ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు, చిప్పగిరి మండల కన్వీనర్ నారాయణ ఆన్న, మరియు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.