Kurnool

కర్నూలు  జిల్లా లో దారుణం

కర్నూలు  జిల్లా లో దారుణం

కర్నూలు (ఆంధ్రప్రతిభ) 29 జూన్:  జిల్లా లో దారుణం చోటుచేసుకుంది కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం ఆలంకొండ  గ్రామానికి చెందిన చాకలి అనిత, బోయ ప్రసాద్  అనే ప్రేమజంట రైల్వే ట్రాక్ పై  ఆత్మహత్యకు పాల్పడ్డారు. డోన్ సమీపంలో ఉన్న మాల్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే సిబ్బంది వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.  వీరిద్దరూ సుమారు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. వీరిద్దరి ప్రేమవ్యవహారం తెలియడంతో బోయ ప్రసాద్ తల్లిదండ్రులు తన మేనత్త కూతురు పెద్దోడ్డి గ్రామానికి చెందిన సురేఖ తో వివాహం జరిపించారు. ప్రసాద్ అనిత ఇద్దరు పారిపోయేందుకు ఆలంకొండ  గ్రామం నుండి వచ్చినట్లు సమాచారం .ఈ నేపధ్యంలో గత రాత్రి గ్రామం నుండి తన హీరో డిలాక్స్ ద్విచక్ర వాహనంపై మాల్యాల రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నట్లు తెలుస్తుంది.

ఇదే సమయంలో వారిద్దరూ పరువు హత్యకు గురయ్యారా?

లేదంటే ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే విషయాలపై గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ జంట రైల్వే ట్రాక్ పై వారి శరీరాలు ముక్కలుగా నుజ్జు నుజ్జుగా కనిపించాయి. ఒక మోటార్ సైకిల్ ను అలాగే ట్రాక్ పై లభించిన రెండు సెల్ ఫోన్ మొబైలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను డోన్  ప్రభత్వఆసుపత్రికి తరలించారు. ఇది పరువుహత్య  లేదంటే ఆత్మహత్యనా అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఇది హత్య లేదంటే ఆత్మహత్య అనేది పోలీసులు నిగ్గుతేల్చాల్సి ఉంది.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button