KurnoolAbdul Javid

శాంతి, సర్వమత సమ్మేళనం కోసం పాటుపడాలి – ఆలిండియా మిల్లి కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మౌలానా అబ్దుల్  ఖదీర్ నిజామి

శాంతి, సర్వమత సమ్మేళనం కోసం పాటుపడాలి – ఆలిండియా మిల్లి కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మౌలానా అబ్దుల్  ఖదీర్ నిజామి

కర్నూలు (ఆంధ్రప్రతిభ) 31 మే: శాంతి, సర్వమత సమ్మేళనం కోసం పాటుపడాలని అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మౌలానా అబ్దుల్  ఖదీర్ నిజామి పిలుపునిచ్చారు. ఆలిండియా మిల్లి కౌన్సిల్ ఆధ్వర్యంలో స్థానిక డివియర్ హోటల్ సమాన భవనంలో శాంతి, మత సామరస్యం పై హార్దిక సమావేశం నిర్వహించారు. అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మౌలానా అబ్దుల్  ఖదీర్ నిజామి  అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కర్నూల్ డిఎస్పీ మహేష్, ప్రఖ్యాత పండితుడు, రచయిత &  ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ జాతీయ సహాయ కార్యదర్శి,  సులేమాన్ ఖాన్,  ముఫ్తీ ఒమర్ ఆబిదీన్ ఖాస్మీ మదానీ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తెలంగాణ, గౌరవ అతిథులు నైట్ ఆఫ్ లివింగ్ డెడ్ అవార్డు గ్రహీత తన్వీర్ అహ్మద్, కోవిడ్ వారియర్ నవీద్ ఇర్ఫాన్ ఇక్బాల్, సయ్యద్ మజార్ సాహెబ్,  సెక్రటరీ AIMC బెంగుళూరు, శ్రీ ఈశ్వర్ స్వామి జీ, శివ దీక్ష పీఠాదిపతి,కర్నూలు, పాస్టర్ ప్రభు దాస్, ఐపిఐ అకాడమి డైరెక్టర్ ముష్తాక్ అహ్మద్ అభిలాష్, అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ నంద్యాల కన్వినర్ జి.ఎం. గౌస్  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అన్ని మత గ్రంథాలలో దేవుడు ఒక్కడే అని చెపుతుందని, మానవులందరూ ఒకే జంట సంతానమని పేర్కొన్నారు. నేటి కాలంలో దేశంలో మత విద్వేషాలు ఎక్కువయ్యాయని, శాంతికి చిన్నమైన మన భారత దేశంలో భిన్నత్వంలో ఏకత్వమని, ప్రతి ఒక్కరు శాంతి కోసం పోటు పడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో పుర ప్రముఖులు, మేధావులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button