KurnoolMahabasha - dhone

విఆర్ఏ లకు కనీస వేతనం రూ. 21,000/- ఇవ్వాలి – వై.నాగేశ్వరరావు యాదవ్

విఆర్ఏ లకు కనీస వేతనం రూ. 21,000/- ఇవ్వాలి – వై.నాగేశ్వరరావు యాదవ్

ప్యాపిలి లోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిర్వహించిన దీక్షకు మద్దతు గా తలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ఆర్.ఈ. నాగరాజు, మాజీ ఎంపీటీసీ రామ్మోహన్ యాదవ్, తెలుగు యువత మండల అధ్యక్షుడు కోదండరామ యాదవ్, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కాంత రెడ్డి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు సుంకయ్య, రమణ గౌడ్, మాధవ రాజు, ప్రణీత్ , శ్రీనివాస్ యాదవ్, అంబాపురం సర్పంచ్, జక్కసానికుంట్ల మహేష్  గణ మద్దయ్య, ఖాజా హుస్సేన్, పూజారి సూరి, చల్లవీరా, నాగేంద్ర , వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై. నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ గ్రామ రెవిన్యూ సహాయకులకు కనీస వేతనం రూ. 21,000/-లు ఇవ్వాలి. డిఏతో కలిపి వేతనం చెల్లించాలని, నామీనీలను విఆర్‌ఏలుగా నియమించాలని, అర్హులకు ప్రమోషన్స్ ఇవ్వాలి, 65 సం||లు దాటి చనిపోయిన విఆర్ఎ కుటుంబంలో కంపాసినేట్ గ్రౌండ్ క్రింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.11వ పిఆర్ సి నివేదికలో విఆర్ఎల వేతనాల పెంపుదల ప్రస్తావనే లేదు. రెవిన్యూ వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 22 వేలకు పైగా విఆర్ఎ లు పనిచేస్తున్నా వారి వేతనాల పెంపుదల ఊసేలేకపోవటం అన్యాయం.ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు రాష్ట్ర కమిటి తెలియజేస్తున్నది.రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎ లకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదు. కేవలంరూ. 10,500/-లతో విఆర్ఎ కుటుంబాలు బ్రతకటం ఎంత కష్టమో ప్రభుత్వ పెద్దలకు తెలియనిద.రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి చర్చిస్తున్న ప్రభుత్వం విఆర్ఎల వేతనాల పెంపుపై కూడా నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం పిఆర్ సి సందర్భంగానే ఆ రాష్ట్రంలోని విఆర్ఎలకు 30 శాతం వేతనాలు పెంచింది. కాని మన రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎల సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం సరైంది కాదు. ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినా ఫలితం లేకపోవటంతో గత్యంతరం లేక ఆందోళన బాటపట్టారు. గత సాంప్రదాయాలకు భిన్నంగా ఇచ్చిన డిఎను వేతనం నుండి రికవరీ చెయ్యటం దుర్మార్గం. ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతరభృతి తిరిగి రికవరీ చేయరాదని స్పష్టంగా చెప్పింది. ఇదే న్యాయం విఆర్ఎల డిఎ రికవరీ విషయంలో కూడా వర్తిస్తుంది. కావున ప్రభుత్వం తక్షణండిఎ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకొని డిఎతో కూడిన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Back to top button