
Kurnool
రోడ్డు ప్రమాదం లో బాలుడు మృతి
కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామం లో సోమవారమ ఉదయం 11: 45 గంటల సమయంలో పెరవలి నుంచి మద్దికేర పోవుదారిలో ఈద్గా దగ్గరలో KA 34 B 6568 నంబర్ గల టిప్పర్ డ్రైవర్ అయిన రమేష్ కుమార్ (ఉత్తరప్రదేశ్ రాష్ట్రం) అను అతను సైకిల్ మీద వస్తున్నా పెరవలి గ్రామానికి చెందిన కూరువ రంగస్వామి (13) బాలుడికి టిప్పర్ ను అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ వస్తున్న డ్రైవర్ సైకిల్ ను తగిలించడంతో సైకిల్ పైన ఉన్న బాలుడు తీవ్రగాయాలు పాలై పత్తికొండ ఆసుపత్రికి తరలించగా గాయాలతో కోలుకోలేక బాలుడు మృతి చెందినట్లు పత్తికొండ ఆసుపత్రి వైద్యులు తెలియజేయడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని విచారిస్తున్నారు.