
gollaprolu
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సబ్బుల పైన దేశ నాయకుల చిత్రపటాలను చెక్కిన ఉపాద్యాయుడు
గొల్లప్రోలు (పల్లెవెలుగు) 14 ఆగష్టు: మండలం చిన్న జగ్గంపేట నందలి ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పిల్లి గోవిందరాజులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సమాజంలో అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సబ్బుల పైన దేశ నాయకుల చిత్రపటాలను చెక్కారు.అలాగే లీఫ్ కార్వింగ్ కళ ద్వారా ఆకులపైన చిత్రాలతో పలువురుని సమాజంలోని అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా గోవింద రాజు మీడియాతో మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సాధనకు కృషి చేసిన దేశభక్తి నాయకులను స్మరించుకోవాలని సూచించారు.ఈ విధంగా విద్యార్థుల్లోను ప్రజల్లోనూ అవగాహన కల్పిస్తున్న పిల్లి గోవింద రాజు మాష్టారును మండల విద్యాశాఖ అధికారి జివిఆర్ దుర్గా ప్రసాద్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.పేర్రాజు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.