eastgodavari

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొండేటి

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొండేటి

అయినవిల్లి (పల్లెవెలుగు) 07 మే:  రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పి .గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈ మేరకు అయిన విల్లి మండలం అయినవిల్లి సొసైటీ వద్ద శుక్రవారం కొనుగోలు కేంద్రాన్ని  ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కుమార్ బాబు , ఎంపీపీ మట్టపర్తి నాగ విజయలక్ష్మి, జెడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాస్, పాల్గొన్నారు.

Back to top button