eastgodavariM.Subrahmanyam

అయినవిల్లి మండలం లో బంద్ విజయవంతం

అయినవిల్లి మండలం లో బంద్ విజయవంతం

అయినవిల్లి (పల్లెవెలుగు) 10 ఏప్రిల్: కోనసీమకు అంబేడ్కర్ పేరు చేర్చాలనే విషయంపై దళిత జెఎసి పిలుపు మేరకు జరిగిన కోనసీమ బంద్ మండలంలో విజయవంతమైంది.  మండల వ్యాప్తంగా వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి తమ మద్దతు తెలిపారు.విద్యా సంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలను నిరసన కారులు మూసి వేయించారు.కోనసీమ కు అంబేడ్కర్ పేరు చేర్చాలని, దళిత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని,ప్రాణాలైనా అర్పిస్తాం అంబేడ్కర్ జిల్లా సాధిస్తామని నినాదాలు చేసారు.జగన్ డౌన్ డౌన్ అనీ నినాదాలు చేసారు.ముక్తేశ్వరం ప్రధాన రహదారిలో ర్యాలి నిర్వహించి నిరసన వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో గిడ్ల వెంకటేశ్వరరావు, బొక్కా రామచంద్ర రావు,కొంకి వెంకట రావు,సర్పంచ్ కాకర బాబ్జి,కుమ్మరి రమణ,న్యాయవాది బడుగు  జోగేష్,వైసిపి నాయకుడు కాగిత రమేష్,టీడీపీ నాయకులు కుసుమ బహుగుణ,,మాజీ సర్పంచ్ లు మోర్త సత్తి బాబు,గుమ్మళ్ళ శ్రీనివాస్ సాగర్ కుంచే చంద్ర కాంతుడు,సరెళ్ళ సత్యనారాయణ, బడుగు దుర్గారావు,సరెళ్ళ శ్రీను,బీర అన్నవరం,బిఎస్పీ నాయకుడు గిడ్ల సురేష్, వీరవల్లిపాలెం ఎంపిటిసి అడపా నాగభూషణం (జనసేన),జనసేన నాయకుడు పడాల గిరి,తోలేటి ఉమ,మహాసేన రవి .సర్పంచ్ కాశి వీరవెంకట సత్యనారాయణ, కొమ్ములు వెంకటేశ్వరరావు ,అప్పారి మహేష్, మురళి కృష్ణ,గిడ్ల  మల్లేశ్వరరావు. అలాగే పట్టాల నరసింహ మూర్తి మాగాపు ఈశ్వరరావు, గుర్రాల చిట్టి బాబు, వజ్రపు బాల కుమార్,పాము సత్యనారాయణ ,క గన్నవరపు లీలతదితరులు పాల్గొన్నారు

Back to top button