eastgodavariM.Subrahmanyam

ఉగాది ఉత్సవాలకు అంకురార్పణ

ఉగాది ఉత్సవాలకు అంకురార్పణ.

అయినవిల్లి (పల్లెవెలుగు) 31 మర్చి:  మండలం కె.జగన్నాధపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుభ కృత్ నామ ఉగాది పండుగ పురస్కరించుకుని ఆలయ ప్రధాన పూజారి అంకం బ్రాహ్మణుడు అర్చకత్వంలో లాంఛనాలలో భాగంగా సంబర మహోత్సవాలు మేకల రత్తాలు(బూర్రయ్య కాపు)కుటుంబ సభ్యులు మంగళ వాయిద్యాలతో బాజా భజంత్రీలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని ఉగాది ఉత్సవాలకు అంకురార్పణ,ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉగాది రోజున జరిగే తీర్థ మహోత్సవానికి యావన్మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్,వల్లభరెడ్డి సూరిబాబు,నల్లా సత్తిబాబు,ఓదూరి చిన్న, నల్లా ఏడుకొండలు,గంధం బాబురావు, నల్ల చిన్న,మణికంఠ అమర వీర బాబు,బండారు ఫణి,శ్రీ విజయ దుర్గ బేతాళ,శ్రీ బాల గణపతి యువ సంఘాల యువకులు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు.

Back to top button