eastgodavariM.Subrahmanyam

కార్మికుల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

కార్మికుల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

అయినవిల్లి (పల్లెవెలుగు) 26 మర్చి:  28,29 తేదీలలో అసంఘటిత కార్మికుల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు బేబీ రాణి పిలుపునిచ్చారు. శనివారం అయినవిల్లి మండలం లోని తోత్తరమూడి జై భీమ్ నగర్ లో మండలం లోని అంగన్వాడీ, ఆశాకార్యకర్తలు, మిడ్డే మిల్స్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అసంఘటిత కార్మికులందరికి కనీస వేతనం 26 వేలు ఇవ్వాలన్నారు అంతేకాకుండా వారికి ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్, పదవి విరమణ సమయంలో 5 లక్షలతో పాటు సంక్షేమ పథకాలు అందించాలన్నారు అనంతరం సమ్మె పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అయినవిల్లి మండల పిహెచ్ సి ఆశకార్యకర్తల యూనియన్ నాయకురాలు ఉమామహేశ్వరి, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు కె వెంకటలక్ష్మి,మిడ్డే మిల్స్ యూనియన్ నాయకురాలు సుంకర నాగమణి, పి బేబీ గంగా రత్నం తదితరులు పాల్గొన్నారు.

Back to top button