eastgodavariM.Subrahmanyam

నదీ కోతను పరిశీలించిన… స్టాలిన్ బాబు.

నదీ కోతను పరిశీలించిన… స్టాలిన్ బాబు.

కోనసీమలో నదీకోతకు గురవుతున్న ప్రాంతాలను పరిరక్షించాలని కోనసీమ అభివృద్ధి సమితి అధ్యక్షులు నేలపూడి స్టాలిన్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక చింతలమెరకలో నదీకోతకు గరవుతున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు.గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నదీకోతకు గురవుతున్న ప్రాంతాలను శాశ్వత ప్రాతిపదికన గ్రోయన్ల నిర్మాణం చేపట్టి గోదావరి పాలవుతున్న సారవంతమైన, విలువైన భూములను పరిరక్షించవలసిన బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయకపోతే భవిష్యత్తు తరాలు నష్ట పోతాయని హెచ్చరించారు. ఆయన వెంట పొలమూరి సత్తిపండు, గుర్రం నాగరాజు, కోట రామచంద్రరావు, హరిప్రసాద్, ఉప్పే నవీన్ తదితరులు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks