eastgodavariM.Subrahmanyam

ఉప్పే సేవలు మరువలేనివి.. స్టాలిన్ బాబు.

ఉప్పే సేవలు మరువలేనివి.. స్టాలిన్ బాబు.

 పాశర్లపూడి లంక, చింతలమెరక ప్రాంతంలో మాజీ ఎం.పి.టి.సి సభ్యులు, సామాజిక సేవకులు కీ.శే. ఉప్పే ప్రకాశరావు సేవలు మరువరానివని కోనసీమ అభివృద్ధి సమితి అధ్యక్షులు నేలపూడి స్టాలిన్ బాబు కొనియాడారు. చింతలమెరక లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకాశరావు సేవా కార్యక్రమాలలో ముందు ఉండేవారని,తన సొంత భూమిని పాఠశాలకు,వాటర్ టాంకుకు దానం చేసి తన సేవానిరతిని చాటారని అన్నారు. ఆయన వెంట పొలమూరి సత్తిపండు, గుర్రం నాగరాజు, కోట రామచంద్రరావు, పొలమూరి హరిప్రసాద్,ఉప్పే నవీన్ తదితరులు పాల్గొన్నారు

Back to top button