eastgodavariM.Subrahmanyam

ఘనంగా బాలయోగి వర్ధంతి

ఘనంగా బాలయోగి వర్ధంతి

అయినవిల్లి (పల్లెవెలుగు) 03 మర్చి:  మండలం కె.జగన్నాధపురం గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర ఉన్నత పాఠశాల ఆవరణలో గల జి.ఎం.సి.బాలయోగి విగ్రహాం వద్ద బాలయోగి 20 వ వర్ధంతి సభకు జి.ఎం.సి.బాలయోగి చారిటబుల్ సొసైటీ మండల అధ్యక్షులు అక్కిశెట్టి దుర్గారావు అధ్యక్షతన  జిల్లా, డివిజన్ కన్వీనర్లు, మాలమహానాడు నాయకులు నామాడి నాగబాబు గిడ్ల వెంకటేశ్వరరావు లు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ బాలయోగి తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో రామాయం పేటలో నిరుపేద దళిత కుటుంబంలో గంటి గన్నయ్య సత్తేమ్మ దంపతులకు జన్మించి స్థానిక బోర్డు స్కూల్ హై స్కూలు చదువుకుని విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం న్యాయ కళాశాల నందు ఉన్నత విద్యను అభ్యసించి న్యాయవాది వృత్తిని చేపట్టి 1986 లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు ఆదర్శాలకు పేద ప్రజలకు కనీస వసతులైన కూడు గూడు గుడ్డ నినాదానికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఎన్నికై ముమ్మడివరం శాసనసభ్యులు గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గాను భారతదేశంలో పార్లమెంట్ తొలి దళిత లోక్ సభాపతి గా రెండు పర్యాయాలు నిర్వహించి కోనసీమ బిడ్డా ఎదిగి అభివృద్ధి కోసం ఢిల్లీ అడ్డాగా చేసుకుని వెనుకబడిన లంక ప్రాంతాల సమూహమైన కోనసీమకు అప్పటి కేంద్ర మంత్రులుగా ఉన్న మమతా బెనర్జీ,ములాయం సింగ్ యాదవ్,రామ్ విలాస్ పాశ్వాన్ వంటి నేతలను కోనసీమకు తీసుకొని వచ్చి స్థానిక స్థితిగతులను వివరించి మన ప్రాంత చిరకాల స్వప్నమైన రైలు ఎదుర్లంక-యానం, కోటిపల్లి-నరసాపురం వంతెనల మార్గాలకు జాతీయ రహదారులకు శంకుస్థాపనలు చేయించి దిశానిర్దేశం చేసి రాష్ట్ర కేంద్ర సంస్థల భవనాలను పునర్నిర్మాణాలతో కోనసీమ మొత్తాన్ని ఆధునీకరించి  జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చి అహర్నిశలు పాటుపడుతూ అటు పార్టీకి ప్రతిష్టను మన ప్రాంతానికి వన్నే తెచ్చి జన హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన సమయంలో 2002 మార్చి 3 వ తారీఖున పశ్చిమగోదావరి జిల్లా కైకలూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కోనసీమ ప్రజ శోక సంద్రమైంది.అప్పటి దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ మాజీ ప్రధాని కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ ప్రధాని శ్రీమతి సోనియా గాంధీ,లాల్ కృష్ణ అద్వానీ,నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు నివాళులర్పించి ఆయన అంత్యక్రియలు పాల్గొనడమే ఆయన ఔన్నత్యానికి తార్కాణమని ఆయన చనిపోయి నేటికీ 20 సంవత్సరాలు అయినా మన బాలయోగి అని గర్వపడేలా పార్టీలకతీతమైన ఎదురు లేని మహనీయుడు అని నేటి తరాల నాయకులకు మార్గదర్శకులుగా నిలిచారన్నారు.

Back to top button