eastgodavariM.Subrahmanyam

ప్రొఫైల్ బ్రిడ్జి నిర్మాణం తక్షణమే చేపట్టాలి స్టాలిన్ బాబు

ప్రొఫైల్ బ్రిడ్జి నిర్మాణం తక్షణమే చేపట్టాలి స్టాలిన్ బాబు

అయినవిల్లి (పల్లెవెలుగు) 24 ఫెబ్రవరి:  మండలంలో వరద సమయంలో తొగరపాయ తరచూ ముంపునకు గురి అవుతూ కాజ్వే పై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడమే కాక పలు లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో పాటు ఈ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పి.గన్నవరం పర్యటనలో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోనసీమ అభివృద్ధి సమితి అధ్యక్షులు నేలపూడి స్టాలిన్ బాబు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు. గత సంవత్సరం ఆగస్టు 16వ తేదీన పి.గన్నవరం లో జరిగిన బహిరంగ సభలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బ్రిడ్జిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, కానీ ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వక పోవడం పట్ల ఆ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని రానున్న జూలై, ఆగస్టు మాసాలలో మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక అప్పనపల్లి లిఫ్ట్, మొండెపు లంక ఛానల్ ఆధునీకరణ పనులు కూడా మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సభాముఖంగా ప్రకటించిన నేపథ్యంలో వీటి ద్వారా లబ్ధి పొందే ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చ కాకపోవడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని ఆయన అన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రకటన అంటే తక్షణమే పరిపాలన ఆమోదం వస్తుందని, కానీ ఈ విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందో అంతుబట్టడంలేదు అన్నారు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి భంగం కలిగిస్తుందని, కనుక ముఖ్యమంత్రి హామీలకు కార్యరూపం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Back to top button