eastgodavariM.Subrahmanyam

నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు తవ్వేస్తున్నారు

నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు తవ్వేస్తున్నారు

అయినవిల్లి (పల్లెవెలుగు) 18 ఫెబ్రవరి:  మండలంలోని జల జీవన్ మిషన్ ద్వారా మంచినీటి సరఫరాకు మండలానికి సుమారు   33. కోట్ల రూపాయల నిధులు మంజూరు   అయ్యాయి  ఈ పథకం ద్వారా గ్రామాల్లో గృహాలకు పైపులైను ద్వారా మంచినీరు  సరఫరా చేసే విధంగా పథకాన్ని అమలు జరుపుతున్నారు  ఈ పథకం ద్వారా ఏర్పాటుచేసె మంచినీటి పైపులైను రోడ్లకు చివర మార్జిన్లో తవ్వవలసి ఉండగా  కాంట్రాక్ట్ర్ నిర్లక్ష్యంతో తమకు అనుకూలంగా రోడ్డుపక్కనే తవ్వేయడంతో కోట్లాదిరూపాయలు విలువచేసే రోడ్లు ధ్వంసమయిపోతున్నాయి  ముందుగా R&B అధికారుల పర్మిషన్ తీసుకుని మార్ఫింగ్ చేసిన చోటు నుండి  పైపులైను వేయాల్సి ఉండగా ఇదేమీ లెక్కచేయకుండా ఇష్టానుసారం  కాంట్రాక్టర్  తవ్వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు   బీటీ రోడ్డు మార్జిన్ తవ్వేస్తున్న R&B అధికారులు కనీసంగా కూడా పట్టించుకోవట్లేదని ప్రజలు విమర్శిస్తున్నారు వర్షం పడితే వాహనాలు దిగిపోయి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది  రోడ్డు మార్జిన్ చివరినుంచి తవ్వాలని ప్రజలు కోరుతున్నారు

Back to top button