eastgodavariM.Subrahmanyam

ఏకాత్మత మానవతావాదం తోనే కుటుంబ పార్టీల పాలనకు విముక్తి

ఏకాత్మత మానవతావాదం తోనే కుటుంబ పార్టీల పాలనకు విముక్తి

అయినవిల్లి (పల్లెవెలుగు) 12 ఫెబ్రవరి:  పండిత దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతంతోనే దేశంలో కుటుంబ పార్టీల పాలనకు ముగింపు జరుగుతుందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు.  భారతీయ జనతా పార్టీ  పూర్వ సంస్థ జనసంఘ్ నాయకుడు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల బిజెపి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు ముద్రగడ రామకృష్ణారావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి చీకురుమెల్లి వెంకటేశ్వరావు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు వేటూరి శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్  సవరపు వెంకటేశ్వరావు,బీర అన్నవరం తదితరులు పాల్గొన్నారు

Back to top button