eastgodavariM.Subrahmanyam

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

 అయినవిల్లి (పల్లెవెలుగు) 18 జనవరి:  మండలంలోని శానపల్లి లంక గ్రామంలో మంగళవారం నందమూరి తారకరామారావు 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలు నాయకులు  మాట్లాడుతూ ఆయన ప్రవేశపెట్టిన పధకాలవల్లే ఇప్పటి సంక్షేమ పధకాలు కొనసాగుతున్నాయన్న విషయాన్ని గుర్తుచేసారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే నినాదంతో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లెప్రసీ రోగులకు పండ్లు బన్నలు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు ఎంపిటిసిలు సర్పంచ్ లు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks