eastgodavarinagendra

మాకు సాయం చేసే చేతులు కావాలి

పిఠాపురం (పల్లె వెలుగు) 21 అక్టోబర్ : పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఎండి పేట లోని ఇద్దరు వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. వారికి వారిద్దరు తప్ప నా అన్న వాళ్ళు ఎవరూ లేరు.వారికి బతకడమే కష్టంగా ఉన్న ఈ సమయంలో, అంతుచిక్కని భయంకర రోగంతో దూలపల్లి రాజులమ్మ పది సంవత్సరాలుగా మంచానికి పరిమితం అయింది. తన భర్త కూలిపని చేసుకుంటూ ఆమె ఆసుపత్రి ఖర్చులకు, వీరు బతకడానికి ఏదో కొంచెం నెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ ఆమె ఆస్పత్రి ఖర్చు నిమిత్తం నెలకి పది వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. వారికి బ్రతకడమే కష్టంగా ఉన్న ఈ సమయంలో ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. అప్పటికి ఈ విషయం తెలిసిన ఆ కాలనీవాసులు, గ్రామంలో ఉన్న యూత్ వారు వారికి తోచిన సహాయం చేసుకుంటూ వస్తున్నాయని తెలియజేశారు. ఇప్పటికే ఇది తెలిసిన ప్రతి వారు ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. కానీ సహాయం అందరూ చేస్తారు కాని వారికి మేము ఉన్నాం మీరు అనాధలు కారు అనే భరోసా ఇచ్చి తోచిన సాయం వారికి అందిస్తారని కోరుతున్నారు. వివరాలు కోసం 7794000784, 96667 43187, 8885556210 సంప్రదించాలని సూచించారు.

Back to top button