eastgodavari

అట్టహాసంగా పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం

పిఠాపురం (పల్లెవెలుగు) 05 అక్టోబర్:  పట్టణంలో స్థానిక పట్టణంలో 7.78 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ, సహకారం శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం ప్రారంభించారు. అలాగే కోటిన్నర రూపాయల నిధులతో నిర్మించనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండున్నర సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి విద్య, వైద్యం, గృహవసతి అంశాలకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వడంతో పాటు అర్హత ఉన్న ప్రతి లబ్దిదారునికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకు వచ్చారన్నారు. అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణ పనులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించడమే కాకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి జిల్లా మంత్రులు, శాసనసభ్యులు అంతా కృషి చేస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అనంతరం పిఠాపురం పట్టణంలో స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబు తల్లిదండ్రుల పేరు మీదుగా నిర్మించిన బస్సు ప్లేటర్ ను జిల్లా మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు: ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ప్రభుత్వ విప్, కొత్తపేట శాసనసభ చిర్ల రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబు, ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు.

Back to top button