
రాయదుర్గం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన బీజేపీ నాయకులు
రాయదుర్గం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన బీజేపీ నాయకులు
రాయదుర్గం (ఆంధ్రప్రతిభ) 18 జూలై: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి సంబంధించి ఉచిత ఆహారధాన్యాలను ఏప్రిల్ మే జూన్ నెల నెల కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చెయ్యవలసిన ఆహారధాన్యాలను పంపిణీ చేయాలంటూ తాసిల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలు మధ్యతరగతి వర్గాలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి కళ్యాణ్ యోజన పథకం కింద ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో 89 లక్షల కుటుంబాలకు 2.68 కోట్ల మంది జనాభా ఈ పథకం కింద లబ్ధి పొందారు ఐదవ దశ వరకు 5వ దశలో 2022 మార్చి వరకు 25 దు లక్షల మెట్రిక్ టన్నులు పైగా పంపిణీ చేయడం జరిగింది ఆరవ దశలో భాగంగా 2022 సెప్టెంబర్ వరకు పంపిణీ చేయాల్సి ఉంది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి ఉచిత ఆహారధాన్యాలను ప్రజలకు అంద చేయకుండా కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేయలేదని రాష్ట్ర వై ఎస్ ఆర్ సి పి నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి నాయకులు తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అంబాజీరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జింక వసుంధర పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు ఉపాధ్యక్షుడు శివశంకర్ కిషన్ మోక్ష నాయకులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు