
అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ యువజన సంఘాల డిమాండ్
అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ యువజన సంఘాల డిమాండ్
- రాయదుర్గం తాలూకా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ విద్యార్థి యువజన సంఘాలు
- భారతదేశ గత ఆర్మీ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది
- అగ్గీనిపత్ ను రద్దు చేయాలి
- దేశ భద్రత ఆర్మీ నీ కాపాడాలి
రాయదుర్గం (ఆంధ్రప్రతిభ) 20 జూన్: ఏఐఎస్ఎఫ్ తాలూకా ఇంచార్జ్ కోట్రేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల అనంతరం సంవత్సరానికి కోటి ఉద్యోగాలు యువకులకు ఇస్తామని చెప్పి మళ్ళీ అధికారం చేపట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు కనీసం సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే లేదు కానీ ఇప్పుడు అగ్నిపత్ ను తీసుకొచ్చి దేశ రక్షణ గోడలు అయినటువంటి ఆర్మీ బలహీనపరిచే ఆలోచనలతో నాలుగేళ్లు కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహిస్తాం నాలుగేళ్ల తర్వాత తీసుకున్న 100 మందిలో 25 మందిని ఎంపిక చేసి అగ్ని వీరులుగా ప్రకటిస్తాం మిగత 75మందికి ఉపాధి లేకుండా చేయడం దుర్మార్గమైన చర్య ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చనిపోయిన యువకులకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఉద్యోగం వారి కుటుంబంలో ఇచ్చేలా ప్రకటించాలీ నిరుద్యోగ యువకులకు ఉపాధి లేకుండా చేసే ఇటువంటి అగ్నిపత్ రద్దు చేసి పాత విధానాన్ని ఆర్మీలో కొనసాగించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ తో గత అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఆగ్నిపత్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షులు అంజీ aiyf నాయకులు నవీన్ కుమార్ నాయక్ Aisf నాయకులూ రాకేష్ కిరణ్ సాయి రామ్. బాల తదితర యువకులు పాల్గొనడం జరిగింది