Rayadurgam

పొలాల్లోని మోటార్లకు మీటర్లు వద్దు – రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్స్టేషన్ ముందు నిరసన

పొలాల్లోని మోటార్లకు మీటర్లు వద్దు – రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్స్టేషన్ ముందు నిరసన

రాయదుర్గం (ఆంధ్రప్రతిభ) 10 జూన్:  తాలూకా గుమ్మగట్ట మండలంలో మోటార్లకు మీటర్లు బిగించేందుకు రద్దు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో గుమ్మగట్ట సబ్స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సిపిఐ తాలూకా కార్యదర్శి ఎం నాగార్జున హాజరయ్యారు. ఈ కార్యక్రమము గుమ్మగట్ట మండల ఏపీ రైతు సంఘం సహకార దర్శి హనుమంతప్ప ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు వేస్తామని జీవో 22 తీసుకువచ్చిందని ఆరునెలల్లో దానిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు సిద్ధమైందని అదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్కు మంగళం పడినట్లే, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఉన్న రైతులకు భరోసా లేదు రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదు, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు గత రబీ ఖరీఫ్ పంటలు పెట్టినప్పుడు సమయంలో పూర్తిగా చేతికి వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న విద్యుత్ మోటార్ లకు మీటర్లు బిగించేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చికేంద్ర ప్రభుత్వాల విధులకు తలవొగ్గి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం బాధాకరం, వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఇదేవిధంగా కొనసాగితే సమస్యల పరిష్కారం కొరకు సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం గుమ్మగట్ట కార్యదర్శి హనుమంతప్ప తిప్పేస్వామి అంజి సిపిఐ మండల నాయకులు మరియు రామదాసు తదితరులు పాల్గొన్నారు

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button