Rayadurgam

మానవత్వం చాటుకున్న సిఐ

మానవత్వం చాటుకున్న సిఐ

రాయదుర్గం (పల్లెవెలుగు) 17 మే:  పట్టణంలో సోమవారం మధ్యాహ్నం లక్ష్మీ బజాజ్ పెట్రోల్ బంకు సమీపంలో ఒక వృద్ధుడు సృహ తప్పి పడిపోయాడు ఇదే సమయంలో విధుల నిర్వహణ భాగంలో లో అటువైపు నుండి తన వాహనం లో వెళ్తున్న అర్బన్ సీఐ సురేష్ బాబు వృద్ధుడు పడిపోవడం గమనించి తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి దగ్గరికి వెళ్లి వృద్ధుని పైకిలేపి కాసేపు కూర్చోబెట్టి నీళ్ళు తాగించి ఎక్కడ నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు అని అతన్ని విచారించగా తాను కర్ణాటక గుల్బర్గా నుండి ఇక్కడికి వచ్చానని సకాలంలో ఏమి తిన్న నందున ఇలా జరిగిందని ఆయన అన్నారు. ఇక్కడి నుండి  తమ ఊరుకు వెళ్లేందుకు 600 రూపాయలు అవసరమని అడగడంతో సి.ఐ తన వద్ద నుండి 600 రూపాయలు ఇచ్చి అక్కడున్న వారికి ఇతను ఆస్పత్రిలో చూపించి తన ఊరుకు వెళ్లేలా చూడమని చెప్పి వెళ్లారు

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button