Rayadurgam

పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని టిడిపి నాయకుల నిరసన

పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని టిడిపి నాయకుల నిరసన

రాయదుర్గం (పల్లెవెలుగు) 14 ఏప్రిల్: వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని ధరలను బాదుడే బాదుడు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెంచడమే కాని తగ్గించడం తెలీదని పట్టణ టిడిపి నాయకులు విమర్శించారు. పెంచిన ఆర్.టి.సి ఛార్జీలను తగ్గించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గురువారం ఉదయం రాయదుర్గం ఆర్.టి.సి డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వినాయక సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి పోరాళ్ల పురుషోత్తం లు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరల రేట్ల నుండి సామాన్య ప్రజలు కొలుకోకముందే ఆర్.టి.సి ఛార్జీలను పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోందన్నారు. ఏకంగా మూడేళ్లలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికే చెందుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక పక్క విద్యుత్ ఛార్జీలు, మరో పక్క ఆర్.టి.సి ఛార్జీల పెంపుతో ఇలా ఏదో విధంగా సామాన్య ప్రజలను వేధిస్తోందన్నారు. ఒక్క ఛాన్స్ తో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనను  అన్ని వర్గాల ప్రజలు ద్వెశిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పెంచిన ఆర్.టి.సి ఛార్జీలను తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు మల్లి, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షుడు హెచ్. ఆనంద్, జిల్లా టి.ఏన్. టి.యు.సి అధికార ప్రతినిధి ఆటో మల్లేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి బడిగే ఇనాయత్ బాషా, వాణిజ్య జిల్లా కమిటీ గాజుల వెంకటేశులు, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు జమీల్ ఖాన్, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు కడ్డిపూడి మహబూబ్ బాషా  బిటిపి చిన్నికృష్ణ, కెడిమి తిప్పేస్వామి, బీగాల వేణు, సిమెంట్ శీనా, వై. వెంకటేశులు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పోరాళ్ల సురేంద్ర ప్రసాద్, పోరాళ్ల ధనార్జున,  ఎంపిటిసి మురుడి గంగాధర్, బుదూరు తిప్పేస్వామి, గుద్దిటి లోకేష్, రావుత్ రాజశేఖర్,ఎల్లప్ప, జిల్లా మైనార్టీ కార్యదర్శి గఫుర్, ఘోర ఖలందర్, కరియన్న, బట్టి తిప్పేస్వామి, గుమ్మఘట్ట ఐ టిడిపి అధ్యక్షుడు బిటిపి రవి చంద్ర, మోపురు ఆశోక్, డబ్బిడి శివ,మెకానిక్ మల్లి, కుమార్, పైతోట శివన్న, జావీద్, కాంబ్లీ ప్రవీణ్, మహేష్, దాసరి సత్తి తదితరులు పాల్గొన్నారు.

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button
Enable Notifications    OK No thanks