
వాల్మీకి మారెప్ప కు నివాళులర్పించిన వాల్మీకి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు బండి క్రిష్టప్ప
వాల్మీకి మారెప్ప కు నివాళులర్పించిన వాల్మీకి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు బండి క్రిష్టప్ప
రాయదుర్గం (పల్లెవెలుగు) 10 ఏప్రిల్: పట్టణం లోని చర్చి ఏరియా లో నివాసముంటున్న వాల్మీకి మారెప్ప అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. రాయదుర్గం నియోజకవర్గం వాల్మీకి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు బండి క్రిష్టప్ప ఆ సేవా సమితి సభ్యులతో కలిసి మృతుడి భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలుసుకొని ఓదార్చి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. దహన సంస్కారాలకు వాల్మీకి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన భార్య మారెక్క కు రూ. 5100 లు అందజేశారు. ఆయన వెంట కోశాధికారి బండి చంద్రశేఖర్, ఒక కార్యదర్శి వాల్మీకి పవన్ కుమార్, సభ్యులు అజయ్ టైలర్ రఘు, మీడియా సలహాదారులు తలారి మల్లయ్య, కాలవ మంజునాథ ఉన్నారు.