
Rayadurgam
మండుటెండలు లకు ఖాళీగా ఉన్న రోడ్డు
మండుటెండలు లకు ఖాళీగా ఉన్న రోడ్డు
మండుతున్న ఎండలు బయటకు వచ్చేందుకు భయపడుతున్న ప్రజలు
రాయదుర్గం (పల్లెవెలుగు) 03 ఏప్రిల్: తాలూకాలోని ప్రజలు మండుతున్న ఎండలకు బయటికి రావడానికి ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఈ ప్రాంతం మొత్తం కొండల ప్రాంతం కావడంతో వేసవి కాలం కావడంతో ఎండలు మరింత ప్రభావాన్ని చూపిస్తుండడంతో విపరీతంగా వేడి గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని భావించి ప్రజలు బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇందులో భాగంగానే రాయదుర్గం పట్టణంలోని ప్రజలు కూడా ఈ మండుటెండలో భయపడి నేను నిత్యావసర సరుకులు కొనేందుకు కూడా బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. సంబంధిత అధికారులు అక్కడ అక్కడ త్రాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు