
Rayadurgam
భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
అత్యంత వైభవంగా ఉగాది పండుగ వేడుకలు
రాయదుర్గం (పల్లెవెలుగు) 02 ఏప్రిల్: తాలూకా పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉగాది పండుగ అత్యంత వైభవంగా ఆయా గ్రామాల ప్రజలు జరుపుకున్నారు. పట్టణాలలో హోలీ పండుగ రోజున హోలీ జరుపుకోవడం జరుగుతుంది. కాకపోతే పల్లెల్లో మాత్రం ఉగాది పండుగ రోజున జరుపు కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉగాది రోజు నుండే మనకు నూతన సంవత్సరం కావడంతో ఈ ఏడాది మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది పచ్చడి చేసి ప్రతి ఒక్కరు పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు నూతన వస్త్రాలు ధరించి ఆలయాలకు వెళ్లి ఈ ఏడాది మొత్తం తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీవించమని దేవానదేవతలను ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.