Anantapur

గుమ్మఘట్ట పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

గుమ్మఘట్ట పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

పాత కేసుల సమీక్ష… మహిళల సమస్యల పరిష్కారంపై ప్రాధాన్యతగా చర్యలు

అనంతపురం (ఆంధ్రప్రతిభ) 18 మే : జిల్లాలోని గుమ్మఘట్ట పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ లోని సిబ్బంది గదులు, లాకప్, ఉమెన్ హెల్ప్ డెస్క్ , రికార్డుల నిర్వహణ, పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని శాంతిభద్రతల గురించి ఆరా తీసి వివిధ పాత కేసులను సమీక్షించారు. మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి విధుల్లో ఉండాల్సిన తీరుపై దిశా నిర్ధేశం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండకూడదన్నారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పని చేయండి. అక్రమ మద్యం, నాటు సారా అక్రమాల కట్టడి కోసం ప్రత్యేక నిఘా వేయాలని సూచించారు.

Anjinayalu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button