ధర్మవరం (పల్లె వెలుగు) ఆగస్టు 22 వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు అందరికి విజ్ఞప్తి తెలియజేయడం ఏమనగా, ఏ రాజకీయ పార్టీ అయినా తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులను, ప్రతినిధులను రెచ్చగొట్టే విధంగా వ్యక్తిగత, విద్వేష పూరిత విమర్శలు చేయరాదు. ప్రజాస్వామ్య బద్దంగా మనోభావాలను కించపరిచే రీతిలో కాకుండా హుందాగా విమర్శలు చేయవచ్చు. శాంతి భద్రతలకు భంగం కలిగే రీతిలో ప్రత్యర్థి వర్గాలను రెచ్చగొట్టే రీతిలో విమర్శలు చేయరాదు. ఏ రాజకీయ పార్టీవారు అయినా వారి విమర్శల వల్ల ఏదైనా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే సదరు విమర్శ చేసిన రాజకీయ పార్టీ నాయకులపైన చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. ఏ రాజకీయ పార్టీవారు అయినా సరే శాంతి భద్రతల రీత్యా ప్రత్యర్థి వర్గం వారి పైన ఏదైనా ఆరోపణలు ఉన్న ఎడల న్యాయస్థానం దృష్టికి తీసుకొని పోయి, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడవచ్చును. అంతేకాని శాంతి భద్రతల సమస్య సృష్టించరాదని మనవి.
