You are currently viewing చెన్నైలో  ఐటా జాతీయ సదస్సు

చెన్నైలో  ఐటా జాతీయ సదస్సు

చెన్నైలో  ఐటా జాతీయ సదస్సు

కడప (ఆంధ్రప్రతిభ) 06 జూన్: ఆల్ ఇండయా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్(ఐటా) యొక్క 2 రోజుల జాతీయ సదస్సు జూన్ 5వ & 6వ తేదీలలో చెన్నైలోని డాన్ బోస్కో యూత్ అనిమేషన్ సెంటర్, ఎన్నుర్ లో జరిగింది. 17 రాష్ట్రాల నుండి ఐటా ప్రతినిధులు హాజరైనారు. మహారాష్ట్ర నుంచి జాతీయ అధ్యక్షులు అబ్దుల్ రహిం  తెలంగాణ నుండి జాతీయ కార్యదర్శి మీర్ ముంతాజ్ అలి హాజరైనారు. ఈ సదస్సులో జాతీయ విద్యావిధానం గురించి చర్చించడం జరిగింది. పాఠ్యపుస్తకాల ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ అన్ని మతాలపై గౌరవభావం పెరిగేలా, అదేవిధంగా సాంకేతిక విద్య, వృత్తి విద్య, మాతృ భాషతో బాటు ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించేటట్లు వుండాలని తీర్మానించడం జరిగిందని మరియు ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వంతో బాటు, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యస్.అబ్దుల్ రజాక్ మరియు రాష్ట్ర కార్యదర్శి యం.డి.రఫీవుల్లాహ్ తెలియజేసినారు. అదేవిధంగా ప్రస్తుతం దేశంలో ఐటా 17 రాష్ట్రాలలో విస్తరించి వుంది. మిగిలిన రాష్ట్రాలలో కూడా ఐటాను విస్తరింపజేయవలసిన అవసరం వుందని రెండవ తీర్మానం చేసినారు. ఈ జాతీయ సదస్సులో AP నుండీ  ఐటా విస్తరణ జాతీయ కార్యదర్శి షాకిర్ హుస్సేన్ పాల్గొన్నారు.