You are currently viewing  జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇసుకనుతక్షణమే సప్లై చేయాలని సిపిఐ

 జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇసుకనుతక్షణమే సప్లై చేయాలని సిపిఐ

ఎమ్మెల్ లిబరేషనజిల్లా కార్యదర్శి,వెంకటేశ్వర్లు, డివిజన్  కార్యదర్శి.గోపాలకృష్ణ, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

నందికొట్కూరు (పల్లెవెలుగు) 25 ఆగష్టు: జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇసుకనుతక్షణమే సప్లై చేయాలని మున్సిపాలిటీ పట్టణంలోని హౌసింగ్ డిఈ ప్రభాకర్ ఏఈవిఎస్ శేఖర్, మరియు సిఐటిసి రాజు కి,  వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న లబ్ధిదారులు అందరికీ ఇల్లు కట్టించి తాళంచెవి వారి చేతికి ఇస్తామని హామీ ఇచ్చారని ఆ హామీ  ఏమైందని  వారు విమర్శించారు ఇల్లు మంజూరై ఐదు మాసాల కావస్తున్నా నేటికినీ లబ్ధిదారులకు ఇసుక ఇవ్వడంతో లబ్ధిదారులు ఇసుకను ప్రైవేట్ వ్యాపారస్తులు దగ్గర కొనుగోలుచేసి బేస్ మట్టం వేసుకున్న ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదు అన్నారు. ప్రైవేటు అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు అందువల్ల తక్షణమే ఇసుకను అందించి బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న లక్షా ఎనభై వేల రూపాయలు ఏమాత్రం సరిపోవని పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపాలిటీలో నాలుగు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో మూడు లక్షలు ఇవ్వాలని ఇప్పటికే జగనన్న కాలనీ లో అరకొర వసతులు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకొని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారన్నారు అదేవిధంగా జగనన్న ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి ఇప్పుడు 45 కిలోమీటర్ల వరకే ఉచితంగా ఇస్తామని పరిధి దాటితే తన్ను ప్రకారం డబ్బులు చెల్లించాలని శరత్ విధించడం ఎంతవరకు సమంజసమన్నారు అందువలన తక్షణమే జగ నన్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేకపోతే సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల తో కలిసిఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో. ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం నాయకులు v  రంగస్వామి, మీ. గణేష్ లిబరేషన్ డివిజన్ నాయకులు, నాగేంద్ర అయ్యా, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు