You are currently viewing టిడిపి రాష్ట్ర మైనార్టీ కార్యదర్శిగా ఎన్నికైన అత్తార్ జాహిద్ హుసేన్ ను అభినందించిన టిడిపి మైనారిటీ నాయకులు జిఎం గౌస్

టిడిపి రాష్ట్ర మైనార్టీ కార్యదర్శిగా ఎన్నికైన అత్తార్ జాహిద్ హుసేన్ ను అభినందించిన టిడిపి మైనారిటీ నాయకులు జిఎం గౌస్

టిడిపి రాష్ట్ర మైనార్టీ కార్యదర్శిగా ఎన్నికైన అత్తార్ జాహిద్ హుసేన్ ను

అభినందించిన టిడిపి మైనారిటీ నాయకులు జిఎం గౌస్

బనగానపల్లి (పల్లెవెలుగు) 04 మే: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన అత్తార్ జాహిద్ హుసేన్ ను టిడిపి మైనార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త జిఎం గౌస్ అభినందించారు. అత్తార్ జాహిద్ హుసేన్, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డిలను జీఎం గౌస్ శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు టిడిపికి పడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలపునిచ్చారు.  వైకాపా ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, ఏ ఒక్క హామీని అమలు చేయలేదని పేర్కొన్నారు. టిడిపి హయాంలోనే మైనారిటీలకు దుల్హన్ పథకం, సబ్సిడీ రుణాలు అందించామన్నారు. జీఎం గౌస్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మైనారిటీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మైనార్టీలకు సబ్సిడీ రుణాలు, దుల్హన్ పథకానికి లక్ష రూపాయలు, మైనారిటీ బ్యాంకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు పరచలేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రషీద్, జావిద్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.