ముఖ్యమంత్రి జగన్ యువతను నమ్మించి మోసగించడం దురదృష్టకరం – మద్దికెరి కైలాస్
నంద్యాల (ఆంధ్రప్రతిభ) 23 జూన్: స్థానిక పట్టణం లోని మునిసిపల్ ఆఫీస్ సమీపం లో ఉన్న తన కార్యాలయం లో టీడీపీ రాష్ట్ర ఎస్సిసెల్ అధికార ప్రతినిధి మద్దికెరి కైలాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యువతను నమ్మించి మోసగించడం దురదృష్టకరం అని కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తేవాలన్నారు. పరతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అమలు చేయాలి, పరస్తుతం ఖాళీగా ఉన్న 179331 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. పరభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 62 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాలి. నలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. వవిధ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేసి స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. యువజన సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు 0.06 శాతం నుండి 3 శాతానికి పెంచాలన్నారు.