ప్రవక్త ముహమ్మద్ (స) ను తెలుసుకుందాం
రాష్ట్ర వ్యాప్త పరిచయ ఉద్యమం నంద్యాలలో ప్రారంభించిన జమాఆతె ఇస్లామీ అధ్యక్షులు అబ్దుల్ సమద్
నంద్యాల (ఆంధ్రప్రతిభ) 23 జూన్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దైవ ప్రవక్త (స) వారిపై వస్తున్న అపోహలను దూరం చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా జమాఅత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర వ్యాప్తంగా రండి ప్రవక్త ముహమ్మద్ (సల్లెలహు అలైహి వ అస్సాల్లం) గురించి తెలుసుకుందాం పరిచయ ఉద్యమాన్ని జూన్ 24వ తేది నుండి జూలై 3 వరకు చేపట్టింది. ఈ నేపథ్యంలో నంద్యాలలో కరపత్రాలు విడుదల చేసి అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జమాఅతె ఇస్లామీ హింద్ స్థానిక అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రవక్త (స) వారిపై వస్తున్న విమర్శలు అక్షేపనీయమని ఆయన అన్నారు. ఈ అపోహలు అపార్థాలు సరైన సమాచారం లేని కారణంగా ఏర్పడినవే కాబట్టి వాస్తవ సమాచారం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఉద్యమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ పరిచయ ఉద్యమం ద్వారా ప్రవక్త ముహమ్నద్ (స) పై ప్రజలకు ఉన్న అపోహలను దూరం చేయడంతో పాటు ప్రవక్త ముహమ్మద్ స వారి బోధనలు తెలియచేయడానికి జమాఅతె ఇస్లామీ హింద్ ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు. ఈ పదిరోజులు తమ క్యాడర్ వివిధ ప్రజా సంఘాలతో కలిసి ఇంటింటా కరపత్రాల , పుస్తకాలు ద్వారా ప్రవక్త జీవితం పరిచయం చేస్తామన్నారు. ఈ పుణ్య కార్యక్రమానికి ఆయా ప్రాంతా ప్రజలు సహకరించాలని సమద్ కోరారు. సమావేశంలో స్ధానిక జమాఅతె ఇస్లామీ హింద్ నాయకులు మోమీన్ గౌస్, అబుబకర్ సిద్దీఖ్, మొహతరమా బేగం అమ్తుస్సలాం, మస్లివుర్రహామాన్, నవాజ్ ఖాన్, ఫజ్లే హఖ్, ఫయాజ్, జమీలుద్దీన్, వరంగల్ సలీం, వైరం సలీం, రషీద్, ముహమ్మద్ షఫీ, బషీర్ తదితరులు పాల్గొన్నారు.