You are currently viewing నంద్యాల వీధి చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం కార్యాలయం  ప్రారంభం

నంద్యాల వీధి చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం కార్యాలయం  ప్రారంభం

నంద్యాల (పల్లెవెలుగు) 26 ఆగష్టు:  వీది చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం కార్యాలయ ప్రారంభోత్సవం  నంద్యాల ఎమ్మెల్యే  శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి చే ఘనంగా ప్రారంభించడం జరిగింది. వీది చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఆకుమల్ల రహీమ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి హాజరు కావడం జరిగింది. రహీమ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణం లో దాదాపు 6 వేల కుటుంబాలు జీవిస్తున్నారని , వీరిలో 4100 మంది మాత్రమే పది వేలు రూపాయలు ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లేని రుణాలు పోందారు, ఇంకా రెండు వేల మంది చిన్న వ్యాపారస్తుల  వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే శిల్పా  రవి ఛంద్ర కిశోర్ రెడ్డీ కి తెలిపారు.           ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణం లో ఉన్నా వీది చిన్న వ్యాపారస్తుల కు అందరికీ ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ ఫలాన్ని అందేవిధంగా సహకరిస్తానని, ఇంటి స్థలాలు కూడా లేని వారు చాలా మంది ఉన్నారని వారందరికీ భవిషత్తు లో సొంత ఇంటికల నెరవేరే విధముగా మా ముఖ్య మంత్రి జగనన్న సహాయముతో నెరవేరుస్తామని తెలిపారు.

అనంతరం సంఘం  తరపున ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వీది చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు G. సత్యం, గౌరవ అధ్యక్షులు ఆకుమల్ల రహీమ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ గంగి శెట్టి శ్రీధర్,  మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఇషాక్ భాషా, మహనందేస్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేణుగోపాల్, కాలికంబ స్వామి దేవస్థానం చైర్మన్ బింగుమల్ల సుబ్బా లక్ష్మయ్య , కౌన్సిలర్స్ 4వ వార్దు కౌన్సిలర్ తబ్రేజ్, 2 వార్డు కౌన్సిలర్ సాదిక్ భాష , 5 వార్డు కౌన్సిలర్ అరిఫ్, 8వార్డు కౌన్సిలర్ భర్త నిజామ్, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ పడకండ్ల సుబ్రమణ్యం, భాచం జగదీశ్వర్ రెడ్డి సుభాష్ యూత్ వెల్ఫేర్అసోసియేషన్ అధ్యక్షులు డీపీ మస్తాన్ వలీ, మధర్ యూత్ అససియేషన్ అధ్యక్షులు డి మురళి, మరియు వీది చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మదార్ వలి, కోశాధికారి నారాయణ, ఉపాధ్యక్షులు తిరుమలేశా, సంజీవ రాజు, సహాయ కార్యదర్శులు చంద్ర పాలు, మొయినుద్దీన్, మరియు సభ్యులు పాల్గొన్నారు