You are currently viewing నెలవారి ట్యూషన్ ఫీజ్ వసూలుకు చర్యలు చేపట్టాలి

నెలవారి ట్యూషన్ ఫీజ్ వసూలుకు చర్యలు చేపట్టాలి

  • పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి S.M.D. రఫీ.
  • పీవైఎల్ జిల్లా నాయకులు యు నవీన్ కుమార్.

నంద్యాల పల్లెవెలుగు)13 ఆగష్టు:  రాష్ట్రవ్యాప్తంగా  కార్పొరేట్ ప్రయివేట్ పాఠశాలల్లో అక్రమ ఫీజులను అరికట్టాలంటే   విద్యాశాఖ అధికారులు నెలవారి ట్యూషన్ ఫీజ్ వసూలు చేసే విధానాన్ని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి రఫీ,పీ వై ఎల్ జిల్లా నాయకులు  U.నవీన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంను  కోరారు.  నంద్యాల పట్టణంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పిడిఎస్యు, పీ వై ఎల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రఫీ, నవీన్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా మూడో దశ సెప్టెంబర్లో ప్రారంభం అవుతుందని ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మరోవైపు ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం గత రెండు నెలలుగా ఆన్లైన్ పేరుతో తరగతులు నిర్వహిస్తూ వేల రూపాయలు ఫీజులు వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒకటో తరగతి కి ఆరువేల నుంచి పదవ తరగతి కి 15 వేల రూపాయలు పుస్తకాల ఫీజ్ వసూలు చేస్తున్నారు. గత విద్యా సంవత్సరం రెండు నెలలు పాఠశాలలు జరిగితే సెవెంటీ పర్సెంట్ ఫీజులు వసూలు చేయడం జరిగిందని అన్నారు. ఈ విద్యాసంవత్సరం పాఠశాల ప్రారంభించే నాటికి పాత ఫీజులు మొత్తం తో పాటు ప్రస్తుతం 50% ఫీజులు కట్టాలని లేకపోతే క్లాస్ ప్రమోషన్ చేయమని విద్యార్థులను తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కరోనా మూడో దశ కారణంగా పాఠశాలలు ఎప్పుడు మూతపడతాయో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. కావున రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రతి నెల  ట్యూషన్ ఫీజ్ వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ కోరుతున్నామన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పద్ధతిలో పుస్తకాలు యూనిఫామ్,ట్యూషన్ ఫీజుల వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఆగడాలను అరికట్టాలని అంటే డిస్టిక్ ఫీజు రెగ్యులేషన్ కమిటీకి పని అప్పజెప్పాలి అన్నారు. లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నారు. 70% ఫీజులు వసూలు చేసిన యాజమాన్యం మాత్రం పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు రెండు నెలల జీతం చెల్లించి చేతులు దులుపుకున్నారు. అందరికీ సమ న్యాయం జరగాలి అంటే ప్రభుత్వం స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న పాఠశాల కళ్లెం వేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంను కోరారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు పీ వై ఎల్ డివిజన్ నాయకులు గిరి,అఖిల్,మధు,వినోద్,వినయ్,బాలు,అరుణ్, మొదలైనవారు పాల్గొన్నారు.