You are currently viewing దురదృష్ట ఘటన అరెష్టులు పై హోమ్ మంత్రిని కలిసిన – sdpi

దురదృష్ట ఘటన అరెష్టులు పై హోమ్ మంత్రిని కలిసిన – sdpi

జనవరి 8 వ తేదీన కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణములో జరిగిన దురదృష్ట ఘటనలు, అమాయక ముస్లిం యువకులు మరియు sdpi కార్యకర్తల అరెష్టులు పై హోమ్ మంత్రిని కలిసిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు

కర్నూలు (పల్లెవెలుగు) 18 జనవరి:  కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణములో జనవరి 8 వ తేదీన శనివారం రోజున పట్టణము లోని తోటగిరి ప్రాంతంలో మసీదు నిర్మాణ వివాదం  గురించి చెలరేగిన హింసాత్మక సంఘటనలు, తదనంతర  ముస్లిం యువకులు మరియు sdpi కార్యకర్తల  పై బనాయించ బడిన  కేసులు మెదలగు విషయాల గురించి కొన్ని  నిజా నిజాలు హోమ్ మంత్రి దృష్టి కి తీసుకురావడo కోసం సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు  మెమొరాండం సమర్పిచడం జరిగింది. సదరు మెమోరాండం ప్రకారం 2022 వ సం,, జనవరి 7 వ తేదీన ఆత్మకూరు పట్టణములోని తోటగిరి లో ఒక దాత ద్వారా ఇవ్వబడిన స్థలములో మసీదు షెడ్ నిర్మాణం జరుగుతున్నది,  భారతీయ జనతా పార్టీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి తన అనుచరులతో అక్కడికి వచ్చి మసీదు నిర్మాణం ఆపాలని లేకుంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని ముస్లిములను బెదిరించి వెళ్ళిపోయాడు. ఇది శుక్రవారం జరిగిన సంఘటన. మరుసటి రోజు శనివారం అనగా 08-01-2022,  వ తేదీన ముస్లిం సోదరులు మశీదు షెడ్ నిర్మాణ పని జరుపుకుంటూ ఉన్నప్పుడు బుడా శ్రీకాంత్ రెడ్డి  తన 30 మంది అనుచరులతో వచ్చి మసీదు నిర్మాణం చేపడుచున్నా ముస్లిములపై రాళ్ళతో దాడి జరిపినాడు, ఏంతో మందికి తీవ్ర గాయాలు అయ్యాయి, ఇందుకు సంబందించిన వీడియో సాక్షాలు కూడా ఉన్నాయి అన్నారు. సదరు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరులు చేసిన దాడి గురించి పట్టణ ప్రజలు మసీదు దగ్గరకు చేరుకోవడం జరిగిందని,   బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరుల నుండి ముస్లిం లను రక్షించుటకుప్రయత్నించారు,  ముస్లిములు పెద్ద సంఖ్యలో చేరిన విషయాని గ్రహించిన బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరులను తన కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి బయలు దేరాడని, అప్పుడు దారిలో పోయే ముస్లిం సోదరులపై తన కారు ను అతి వేగంగా నడిపి వారిని కారుతో గుద్ది హత్య చేయాలని కుట్ర పన్నాడన్నారు, ఆ ఘటనలో ఒక 7 సం,,  పిల్లవాడు తన రెండు కాళ్ళు పోగొట్టు కున్నాడు, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయినాయి, మరికొందరు గాయపడ్డారు, తదనoతరం బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరులు పై హత్య ప్రయత్నం చేసి ఆత్మకూరు పోలీసు స్టేషన్ నందు తల దాచుకున్నాడన్నారు. మశీదు పై దాడి, ముస్లింలపై దాడి, ఏడేళ్ళ చిన్నారి తన రెండు కాళ్ళు కోల్పోవుట తన కారు తో ముస్లింలను చంపాలి అనే దురుద్దేశం తో కారు ఎక్కించి ముస్లిం సోదరులకు తీవ్రంగా గాయపరచుట తదితర హృదయ విదారక సంఘటనలు ఆత్మకూరు, వెలుగోడు, మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాలకు సోషల్ మీడియా ద్వారా క్షణాలలో చేరవేయ బడ్డాయి, మశీదు నిర్మాణ ప్రదేశం ముస్లిముల ఆధిక్యత ఉన్నానూ , పట్టణములో హిందూ ముస్లిం లు సోదర భావంతో నివసించే ప్రశాంతమైన ఆత్మకూరు పట్టణములో ఈ మతోన్మాదుల దాడులు ఏంటి అని ప్రజలు జీర్నిచుకోలేక పోయి, భావోద్వేగాలకు లోనై వందల సంఖ్యలో చుట్టూ ప్రక్కల ప్రాంతాల ప్రజలు ఆత్మకూరు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకోవడం వాస్తవం, ఆకస్మిక మరియు అన్య్యాయపూరిత ఈ సంఘటనలు ప్రజల సమూహాన్ని కోపావేశాలకు గురిచేసాయి,  బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరులను తీవ్రంగా శిక్షించాలని, కాళ్ళు పోగుట్టుకున్న చిన్నారిని, గాయపడిన వ్యక్తులకు, మరియు మశీదు విషయములో న్యాయం చేయాలని  ప్రజలు నినాదాలు చేశారు, ఆ సమయంలో పోలీసు అధికారులు సరైన రీతిలో జవాబు ఇవ్వలేదని అప్పుడు  పోలీసులు లాటీ చార్జి, గాలిలో ఫైరింగ్ లాంటి  తీరు ఈ సమూహాన్ని ఇంకా కోపావేశాలకు గురిచేసింది,  ఆ సమయంలో పోలీసు బెటాలియన్  రావడం  చూసి ప్రజలు వెళ్ళిపోవడం జరిగింది తరువాత జరిగిన వాహనాలు తగలబెట్టడం, పోలీసు స్టేషన్ లో దాడికి ప్రయత్నిచడం అనేది సదరు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరులు ముస్లిం ల వేషంలో, జుబ్బాలు, మరియు టోపీలు వేసుకుని , ఇలాంటి చట్ట విరుద్దమైన కార్య కలాపాలు చేశారని అక్కడి ప్రజల అనుమానము, ఉందన్నారు,  ఈ సంఘటనలు ప్రణాలికా భద్దంగా బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరులు చేసారు అని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఉందని, కాని  పోలీసులు కేవలం బుడ్డ శ్రీకాంత్ రెడ్డి మరియు ఒకరిద్దరు అనుచరుల మీదనే కేసులు 307 సెక్షన్ల నమోదు చేశారు, కాని బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరులు,  ఇంతకూ ముందు కూడా అనేక ప్రదేశాలలో ముస్లింల పైన, వారి మతo పై విషం చిమ్మి వారిని రెచ్చగొట్టి దేశ సమైక్యతను దెబ్బతీయాలని ప్రయత్నిచడం జరిగింది అందులో భాగంగానే ఇది కూడా పెద్ద కుట్ర అని దీని పై పోలీసు వారు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరుల పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది, కాని చిన్న చిన్న సెక్షన్ ల తో ఒకరిద్దరు తప్ప వేరే వారి పై కేసులు పెట్టలేదు, అదే సమయంలో పై ఆత్మకూరు ఘటనను ప్రణాలికా భద్దంగా జరిగింది అని ఆత్మకూరు- మరియు వెలుగోడు చెందినా సుమారు 100 మంది ముస్లిం యువకుల పై 307 , మరియు వివిధ సెక్షన్ ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేసి  కోర్టు వారి ద్వారా రిమాండ్ కు పంపారు, కాని సదరు కర్నూలు జిల్లా S.P. సుదీర్ కుమార్ రెడ్డి SDPI   సోషల్ డెమాక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా  పైన ఎటువంటి ఆధారాలు లేక పాయినా ప్రెస్ మీట్ ద్వారా నిందలు మోపడం చాలా దురదృష్ట కరం అని పై విషయాలను అయన లేఖలో ప్రస్తావించారు.  అదే విధంగా సదరు మశీదు నిర్మిస్తున్న ప్రదేశం లో సుమారు 150, ముస్లిముల కుటుంబాలు నివాసం ఉన్నాయి, కేవలం 7 హిందూ సోదరుల కుటుంబాలు మాత్రమె ఉన్నాయి, అందులో కూడా మూడు కుటుంబాల వారు నాటు సార  అమ్మకం  చేస్తున్నారన్నారు, చట్ట వ్యతిరేకమైన వ్యాపారం చేస్తున్న ఆ మూడు కుటుంబాలకు అండగా బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరులు ఉన్నారు అని,  కాబట్టి హోమ్ మంత్రి నిజా నిజాలు గ్రహించి ఆత్మకూరు సంఘటనల విషయంలో న్యాయం చేకూర్చాలని  బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అతని అనుచరుల హత్యా యత్నంలో రెండు కాలు పోగుట్టుకున్న చిన్నారి, మరియు గాయపడిన ముస్లిం కుటుంబాలకు  ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని  రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల లో మాట విద్వేషాలు రెచ్చగొడుతున్న భారతీయ జనతాపార్టీ కార్య కర్తల పైన నిఘా ఉంచి కట్టడి చేయాలని డిమాండ్ చేసారు. సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కర్నూల్ జిల్లా అధ్యక్షులు జహంగీర్ అహమ్మద్ మరియు రాష్ట్ర  కమిటీ సభ్యులు హోమ్ మంత్రిని  కలిసిన వారి లో ఉన్నారు.